సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్యప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. మహాయాన మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. వినోదప్రధానంగా రూపొందించిన రాజకీయ వ్యంగ్య చిత్రమిది. చెప్పులు కుట్టుకొని జీవితాన్ని సాగించే ఓ వ్యక్తికి సంబంధించిన ఓటు ఎన్నికల సమయంలో ఇద్దరి ప్రత్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారుతుంది. ఈ క్రమంలో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే చిత్ర కథాంశం. సంపూర్ణేష్ బాబు పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభిస్తున్నది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: దీపక్ యురగెరా, సంగీతం: స్మరణ్‌సాయి, కథ: మడోన్ అశ్విన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వెంకటేష్ మహా, దర్శకత్వం: పూజ కొల్లూరు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)