హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బైడెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. కాగా, హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)