త్రిపుర గవర్నర్‌గా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం రాత్రి ఒక ప్రకటన చేసింది. త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనా రెడ్డి నియమితులు కాగా, ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం రఘుబర్ దాస్ నియమితులయ్యారు. నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా వాసి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు మలక్ పేట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1983లో, 1985, 1999లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)