అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మైనేలోని లెవిస్టన్లోగల బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటుచేసుకొన్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురై, పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలో యూఎస్ ఆర్మీలో పనిచేసిన రిజర్వ్ సభ్యుడు రాబర్ట్ కార్ట్ (40)గా పోలీసులు గుర్తించారు.