Namaste NRI

కీడా కోలా సెకండ్ సింగిల్.. కయ్యాల చిందాట

తరుణ్‌భాస్కర్‌ నటిస్తున్న చిత్రం కీడా కోలా. విజి సైన్మ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో  బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాలోని కయ్యాల చిందాట అనే గీతాన్ని విడుదల చేశారు. మాస్‌ను మెప్పించేలా హుషారైన బీట్‌తో ఈ పాట ఆకట్టుకుంది. వివేక్‌ సాగర్‌ స్వరపరచిన ఈ పాటను నిక్లేష్‌ సుంకోజీ రచించారు. హేమచంద్ర ఆలపించారు. యూనిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీ ఇది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. వినూత్నమైన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్‌, నిర్మాతలు: వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ, రచన-దర్శకత్వం: తరుణ్‌భాస్కర్‌ దాస్యం.కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events