అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ తలకోన. నగేశ్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శఖుడు రామ్‌గోపాల్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు అందం అంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్సులు, ఫైట్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.శివాజీరాజా మాట్లాడుతూ తలకోన అడవిలో నేను కూడా కొన్ని సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్ పూర్తి చేశారు అంటేనే యూనిట్ సంకల్పం అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలి అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ షూటింగ్ మొత్తం అడవిలోనే చేశాం. క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది. ప్రకృతిలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు ఎలా ఉంటాయో చూపించాం అని తెలిపారు. యాక్షన్, అడ్వెంచర్ అంశాలున్న చిత్రమిదని హీరోయిన్ అప్సరా రాణి పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: సుభాష్ ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి. నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది.