అమెరికాలోని బే ఏరియాలో దసరా, దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్, బాలీ 92.3 సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రతియేటా ఈ ఫ్లాగ్షిప్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. బే ఏరియాలో 45కు పైగా భారతీయ సంస్థలు ఈ ప్రత్యేకమైన ఈవెంట్‌కు మద్దతుగా నిలిచాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతంగా ఉన్న ఈ ఈవెంట్ ఆహూతులను ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్యం వంటి వాటిపై నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/AA_f633d4cfe4-1024x576.jpg)
ఈ ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సిపిఎ, డాక్టర్ ప్రకాష్ అద్వానీ, ఇతర స్పాన్సర్లుగా రిలేటర్ నాగరాజ్ అన్నయ్య, యు ఎస్ బ్యాంక్, ఐసి ఐసిఐ బ్యాంక్, ట్రావెలాప్ పాడ్, ఆన్‌షోర్ కరే, ఎన్ బిసి News, విజేత సూపర్ మార్కెట్ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఎన్నారై ప్రముఖులు, వివిధ హోదాలలో ఉన్న అధికారులు, ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించి అభినందనలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/AAAA_20658b9cd7-1024x576.jpg)
ఆలమీడా కౌంటీ సూపర్వైజర్ డేవిడ్ హౌబెర్ట్ (కో-హోస్ట్), భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, స్టేట్ సెనేటర్ డేవ్ కోర్టేస్, అసెంబ్లీ సభ్యులు లిజ్ ఒర్టెగా, అలెక్స్ లీ, ఆలమీడా కౌంటీ సూపర్వైజర్లు ఎలిసా మార్క్వెజ్, లీనా టామ్, మేయర్ కార్మెన్ మోంటానో (మిల్పిటాస్), వైస్ మేయర్లు మైఖేల్ మెక్ కోరిస్టన్, జాక్ బాల్చ్, కౌన్సిల్ సభ్యులు రాజ్ సాల్వాన్, శ్రీధర్ వెరోస్ తదితరులు అందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/AAA_7d021301f1-1024x576.jpg)
ప్రేమ, ఆరోగ్యం, సంపద పంచేందుకు లక్ష్మీ పూజ లడ్డూను వేలం వేశారు. ఈ ఈవెంట్ ఘన విజయం సాధించడంపై ఏఐఏ బృందం హర్షం వ్యక్తం చేసింది. వెస్ట్ కోస్ట్‌లో అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటని తెలిపింది. తమకు నిరంతరం మద్దతు తెలుపుతున్న స్పాన్సర్లందరికీ ఏఐఏ బృందం ధన్యవాదాలు తెలిపింది.