సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా నటిస్తున్న చిత్రం టిల్లు స్కేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక . ఈ సీక్వెల్ కల్ట్ మూవీగా నిలవడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటల కు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని, మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ని మించి విజయాన్ని సాధి స్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న సినిమా విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా సాయిప్రకాశ్ గుమ్మడిసిం గు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)