Namaste NRI

యానిమల్‌ నుంచి సెకండ్ సింగిల్.. వచ్చేసింది

రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం యానిమల్.  భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌పై యానిమల్ సినిమాను నిర్మిస్తున్నారు.   ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. నే వేరే అంటూ సాగే ఈ పాట సందీప్‌రెడ్డి అభిరుచికి నిదర్శనంలా అనిపిస్తుంది. మానవతా విలువలు, మనసుల్ని తాకే అనుభూతులు, వివాహం తర్వాత తలెత్తే సంక్లిష్టమైన విభేదాల నేపథ్యంలో ఈ పాట సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. అనంతశ్రీరామ్‌ రచించిన ఈ పాటను శ్రేయాస్‌ పురాణిక్‌ స్వరపరిచారు. కార్తీక్‌ ఆలపించాడు. రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్నా అనుబంధ, విభేదాలను ఆవిష్కరించేలా ఈ పాట ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. సంప్రదాయ సరిహద్దులను దాటి, ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. డిసెంబర్‌ 1న యానిమల్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events