అగ్ర నటుడు కమల్‌హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన నాయకుడు (1987) చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం (కెహెచ్ 234) చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఇలాంటి శుభ తరుణం కోసం సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత ఇద్దరు లెజెండ్స్ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుందన్న నమ్మకం ఉంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్, యాక్షన్: అన్బరిన్, ఎడిటర్: శ్రీకర ప్రసాద్, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్, రచన-దర్శకత్వం: మణిరత్నం, ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.