Namaste NRI

హరీశ్ శంకర్ చేతుల మీదుగా ప్రేమకథ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రేమకథ. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథ సినిమా ఫస్ట్ లుక్ ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్  రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ బాగుందని, సినిమా సూపర్ హిట్ కావాలని మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు హరీశ్ శంకర్. వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ప్రేమకథ చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ చిత్రానికి డీవోపీ – వాసు పెండెం, మ్యూజిక్ – రధన్, ఎడిటర్ – ఆలయం అనిల్, ఆర్ట్ డైరెక్టర్ – వీర మురళి, కాస్ట్యూమ్స్ – శివాని ఎర్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ –  గిరి పిన్నింటి, లైన్ ప్రొడ్యూసర్స్ – ఈ. శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్ రెడ్డి, చందు కొదురుపాక, లిరిక్స్ – కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్, బ్యానర్స్ – టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్, నిర్మాతలు – విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్, కో ప్రొడ్యూసర్ – ఉపేందర్ గౌడ్ ఎర్ర , పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా, రచన దర్శకత్వం – శివశక్తి రెడ్ డీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events