Namaste NRI

ఎన్నారై శాఖల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ప్రవాస భారతీయులందరూ కలిసి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం  రావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారై శాఖల ప్రతినిధులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ  ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సమయంలో మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు.

తెలంగాణ సాధన తర్వాత రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వం తెలంగాణకు అవసరముందనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. గొప్ప చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులంటే గ్రామాల్లో చాలా గౌరవభావం ఉందని, వారు చెబితే ఓటర్లు వింటారని పేర్కొన్నారు. రానున్న 30 రోజులు ఎంతో కీలకమని తెలిపారు. దారితప్పి ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. గతంలో తెలంగాణ అనుభవించిన కష్టాలను, ప్రస్తుతం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టులను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలను చైతన్యం చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ  జూమ్ కాల్ ముఖాముఖీ కార్యక్రమానికి హాజరైన 52 దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారానికి వచ్చేవారంతా సమన్వయం చేసుకోవాలి. ప్రచారానికి అందరి తేదీలు ఇవ్వాలి. ఒక ప్రెస్ మీట్ నిర్వహించుకుని ప్రత్యక్ష ప్రసారంలోకి వెళ్దాం. సోషల్ మీడియా వేదికల్లో చురుగ్గా ఉంటూ తెలంగాణ అభివృద్ధిని అందరికి చేరేలా ప్రచారం చేయాలి. ప్రచారానికి అవసరమైన మొత్తం కంటెంట్ అందజేస్తాం. ప్రత్యక్ష ప్రచారం, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం విషయమై ఏ విషయంలోనైనా సూచనలు, సలహాలు కావాలంటే మమ్ముల్ని సంప్రదించండి అని \ అన్నారు. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఎన్నారై మహేశ్ తన్నీరు మాట్లాడుతూ అందరూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని, తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events