శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు నటిస్తున్న విషయం తెలిసిందే. ఆవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తు న్నారు. ఈ సినిమాలో సూపర్‌స్టార్లయిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్‌ని దర్శకుడు ముఖేశ్‌కుమార్‌సింగ్ న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. పోరాట సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఉపయోగించిన డ్రోన్ కెమెరా ఉన్నట్టుండి విష్ణు మీదకు దూసుకురావడంతో చేతులతో పాటు పలు చోట్ల మంచు విష్ణుకు గాయాలయ్యాయి. దాంతో షెడ్యూల్ విరామం ప్రకటించి చిత్ర యూనిట్ హుటాహుటిన విష్ణుని హాస్పిటల్‌కి తరలించారు. జరిగింది భయపడాల్సినంత పెద్ద ప్రమాదం కాదని, విష్ణుకి తగిలినవన్నీ స్వల్పగాయాలేనని చిత్ర యూనిట్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.