తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం తలైవా 170. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్ట్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ స్టార్, షెహన్ షా తలైవా 170 సెట్స్‌లో కలిస్తే షూటింగ్ స్పాట్‌లో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ స్టిల్‌ను షేర్ చేశారు. బిగ్ బీ ఫోన్‌లో చూస్తుంటే పక్కనే ఉన్న తలైవా నవ్వుతూ కనిపిస్తున్నాడు. తలైవా 170 ముంబై షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్ రావాల్సి ఉంది. ఈ మూవీలో గురు ఫేం రితికా సింగ్ ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు లెజెండరీ యాక్టర్లను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.