దినేష్తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. మారేష్ శివన్ దర్శకుడు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ సకుటుంబ కథా చిత్రమిది. ప్రేమలోని సున్నిత భావాలకు అందమైన దృశ్యరూపంలా నిలుస్తుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధానాకర్షణగా ఉంటుంది. చక్కటి కథాంశంతో తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు సైతం ప్రశంసించారు. వైవిధ్యమైనన ఇతివృత్తంతో రూపొందిన ముక్కోణపు ప్రేమకథగా ఆకట్టుకుంటుంది అని చెప్పారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ, సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: చంద్రబోస్, దర్శకత్వం: మారేష్ శివన్.