మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఖండించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ దాడి ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటన లు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. స్వేచ్ఛాయుతా వాతావరణంలో ఎన్నికలు జరుగాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఆగం కానివొద్దన్నారు. హింసా రాజకీయాలకు పాల్పడే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)