మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన గట్టని రాజు అభ్యర్థిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైంది. వెంటనే కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు.