భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్సూచి అని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్‌పై కవిత కీలకోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని కెసిఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. కెసిఆర్‌ను అభినవ చాణక్య అని కవిత అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సిఎం కెసిఆర్ అని స్పష్టం చేశారు. కెసిఆర్ ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి స్పూర్తినిచ్చారన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని వ్యాఖ్యానించారు. తాము పని చేశామని, మూడో సారి ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని, ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సిఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు.