Namaste NRI

ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్: నాగార్జున

ఇండియా జాయ్‌, ఫ్లయింగ్‌ మౌంటెయిన్‌ కాన్సెప్ట్స్‌ సమర్పణలో సినిమాటిక్‌ ఎక్స్‌పో కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున, దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీజీ విందా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 1974లో అన్నపూర్ణ స్టూడియోను ఓపెన్‌ చేశాం. నెలకు ఒక్క రోజు షూటింగ్‌ జరిగితే చాలు అనుకునే వాళ్లం. అప్పటికి హైదరాబాద్‌కు ఫిల్మ్‌ ఇండస్ట్రీ షిప్ట్‌ కాలేదు. అలాంటిది ఈ రోజు హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రస్థానాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. త్వరలో హైదరాబాద్‌ ఫిల్మ్‌ కేపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారబోతున్నది. ఇప్పటికే అందుకు సరిపడా అన్ని హంగులను సమకూర్చుకున్నది అన్నారు.

తెలుగు ప్రజలకు సినిమా అంటే ప్రాణం. అందుకే దేశం మొత్తం వచ్చే వసూళ్లు ఒక్క తెలుగు రాష్ర్టాల్లోనే వస్తాయి. ఇప్పుడు సౌత్‌ ఫిల్మ్స్‌ను ఇండియా మొత్తం ఫాలో అవుతున్నది. మన సినిమాలు ఆస్కార్‌ వేదికల మీద సత్తా చాటుతున్నాయి. హైదరాబాద్‌లో సినీ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గొప్ప సహకారం అందిస్తున్నది. మంత్రి కేటీఆర్‌గారు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ కృషి వల్ల హైదరాబాద్‌ టెక్నాలజీలో పురోగమిస్తున్నది అన్నారు.

ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు యానిమేషన్‌, గేమింగ్‌ ఇండస్ట్రీ అంతగా అభివృద్ధి చెందలేదు. 2016లో తీసుకొచ్చిన పాలసీ ఎంతో ఉపయోగపడింది. చక్కటి ప్రణాళికలతో పాలసీలను అమలు చేశాం కాబట్టే ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతున్నది అన్నారు. గత పదేళ్లుగా తెలుగులో సాంకేతికంగా అద్భుతమైన సినిమాలొస్తు న్నాయని, హాలీవుడ్‌వాళ్లు కూడా ఇక్కడికొచ్చి పనిచేస్తున్నారని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress