Namaste NRI

మహా శివరాత్రి కానుకగా డబుల్ ఇస్మార్ట్‌

టాలీవుడ్‌  డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. రామ్‌ పోతినేని  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ అప్‌డేట్ అందించి రామ్-పూరీ టీం అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కొనసాగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.   పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది మార్చి 8న మహా  శివరాత్రి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.  ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తుండగా,  దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events