వాసవీ గ్రూపు భాగస్వామ్యంతో సుమధుర గ్రూపు నిర్మించనున్న ది ఒలింపస్ రెసిడెన్షియల్ టవర్స్ బ్రోచర్‌ను మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమధుర గ్రూపు సీఎండీ మధుసూదన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన, అన్నివర్గాలవారికి నివాసయోగ్యంగా ఉండేలా నిర్మాణం జరుగుతుందన్నారు. గచ్చిబౌలి నానక్ రామ్‌గూడలో 5.06 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో 44 అంతస్తుల టవర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరంలోనే ఎత్తయిన టవర్స్‌ను వాసవీ, సుమధుర గ్రూపులు సంయుక్తంగా నిర్మించడం సంతోషంగా ఉందని ఉన్నదని తెలిపారు. 854 కుటుంబాలు అత్యంత సౌకర్యంగా నివసించేలా టవర్స్ నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ, సుమధుర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.