శివాజీ హీరోగా, వాసుకి ఆనంద్‌సాయి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న వెబ్‌సిరీస్ 90s ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్. ఆదిత్య హాసన్ దర్శకుడు. రాజశేఖర్ మేడారం నిర్మాత. ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ని అగ్రహీరో వెంకటేశ్ విడుదలచేశారు. 90s జ్ఞాపకాలను గుర్తుచేస్తూ టీవీలో మనోరంజని కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ మొదలైంది. శివాజీ ఓ మిడిల్‌క్లాస్ ఫాదర్‌గా, స్కూల్ టీచర్‌గా కనిపిస్తున్నారు. అతని భార్య పాత్రలో వాసుకి కనిపిస్తున్నది. ఓ కుటుంబం చుట్టూ అల్లుకున్న అలనాటి జ్ఞాపకంలా ఈ చిత్రాన్ని మలిచామని మేకర్స్ చెబుతున్నారు. ఈటీవీ విన్ యాప్ ద్వారా వచ్చే సంక్రాంతికి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్‌సిరీస్‌కి సంగీతం: సురేశ్ బొబ్బిలి, కెమెరా: అజీమ్ మహ్మద్.