ఫిలడెల్ఫియాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదలైన సందర్భంగా ప్రవాస ఆంధ్రులు, ఎన్నారై టీడీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి, మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఏనాటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పిన ప్రవాసాంధ్రులు అన్నారు. ప్రజలకు దూరం చూసే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు చేశారని దుయ్యబట్టారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/11/TDP_NR_Is_595448b3b3-1024x576.jpg)
చంద్రబాబు పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. న్యాయం చేయాల్సిన చోట జాప్యం జరగడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రోజురోజుకూ పతనమవు తోందన్నారు. తెలుగువారి అభ్యున్నతి కోసం ఒక శ్రమ జీవి చేసిన చెదరని, చెరిగిపోని శతాబ్దపు సంతకం.. నారా చంద్రబాబు నాయుడు.. అని నినదించారు. తమ బిడ్డల భవిష్యత్తుకు ఆనాడు ఆయన చేసిన నిరంతర కృషి, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, పట్టు వదలని సత్సంకల్పం ఫలితమే ఈనాడు అమెరికాలో తెలుగు జాతి శాశ్వత విజయకేతనం అన్నారు.