Namaste NRI

దిగ్విజయంగా రాజశ్యామల యాగం పరిసమాప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు నిర్వహించిన రాజశ్యామలయాగం విజయవంతంగా పూర్తయింది.  ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో   యాగశాలలో చివరి రోజు రాజశ్యామల అమ్మవారు నర్తన కాళి అవతారంలో దర్శనమిచ్చారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షించారు.

 పూర్ణాహుతి ముహూర్త సమయానికి రాజశ్యామల అమ్మవారి మంత్రాలను మూడు లక్షల సార్లు హవనం అయ్యేలా పండితులతో చర్చించారు. కుంభోద్వాసన చేసిన అనంతరం యాగంలో మంత్రించిన జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులపై చల్లారు. యాగం ప్రారంభానికి ముందు కేసీఆర్ దంపతులు ధరించిన కంకణాలను యాగశాలలో కంకణ విసర్జన ద్వారా పీఠాధిపతులకు అందించారు. దీంతో రాజశ్యామల యాగం పరిసమాప్తమైంది. యాగం పరిసమాప్తి అయిన అనంతరం, కేసీఆర్ దంపతులకు వేద పండితులు మహదాశీర్వచనం అందిస్తూ విశాల సామ్రాజ్య ప్రాప్తిరస్తు అని దీవించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events