పాయల్‌రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్న చిత్రం మంగళవారం. అజయ్‌భూపతి దర్శకుడు. డార్క్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యువ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర అనే ప్రత్యేక గీతాన్ని చేశారు. గణేష్.ఏ రాసిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మాస్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు తరుణ్‌భాస్కర్.
దర్శకుడు అజయ్‌భూపతి మాట్లాడుతూ గోదావరి జిల్లాలోని పల్లెటూర్లలో ఆటపాటల సందర్భంగా పిల్లలు పాడుకునే పాట ఇది. పల్లె జనం సంభాషణలు, ఊరిలోని పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తూ పాట సాగుతుంది. ఇప్పటివరకు భారతీయ తెరపై రానటువంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది అన్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌భూపతి.