రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం బబుల్‌గమ్. మాసన చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేవు దర్శకుడు. పీపుల్ మీడియాతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి న ప్రమోషన్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ పాకాల స్వరాలందించిన ఈ చిత్రంలోని పాటల్లో హబీబీ జిలేజీ అని సాగే తొలి పాటను విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. శ్రోతలను ఆకట్టుకునేలా పాట సాగిందని, శ్రీచరణ్ పాకాల మాస్ మెచ్చే విధంగా మ్యూజిక్ అందించారని, మనసుల్ని హత్తుకునే ప్రేమకథగా బబుల్‌గమ్ రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ చితానికి కథ: రవికాంత్ పేరెవు, విష్ణు కొండూరు, సెరి గన్ని, కెమెరా: సురేశ్ రగుతు.