Skip to main content

Namaste NRI

ఈ ఘటన తీవ్రంగా  కలచివేసింది: అమెరికా

 అమెరికాలో భారత విద్యార్థి పుచ్చా వరుణ్‌ రాజ్‌పై అక్టోబర్‌ 29న అమానుష దాడి జరిగింది. జిమ్‌ నుంచి తిరిగి వెళ్తున్న వరుణ్‌ రాజ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన వరుణ్‌రాజ్‌ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై తాజాగా అమెరికా స్పందించింది. భారత విద్యార్థిపై దాడి ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొంది. వరుణ్‌ రాజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు అమెరికాలోని ఇండియానా స్టేట్‌ గవర్నమెంట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఖమ్మం జిల్లా మామిళ్లగూడేనికి చెందిన 24 ఏండ్ల పుచ్చా వరుణ్‌ రాజ్‌ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోగల వల్పరైసో నగరంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబర్‌ 29న జిమ్‌కు వెళ్లిన వరుణ్‌ తిరిగి ఇంటికి వెళ్తుండ‌గా ఓ దుండ‌గుడు క‌త్తితో తలపై పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దవాఖానకు త‌ర‌లించారు. ప్రస్తుతం లైఫ్‌ సపోర్టుపై వరుణ్‌కు చికిత్స అందుతున్నది.

Social Share Spread Message

Latest News