జపాన్ తెలుగు సమాఖ్య (జెటిఎస్) ఆధ్వర్యంలో ఆ దేశ రాజధాని టోక్యోలోని కొమత్సుగవా పార్కులో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు జరుపుకుంది. తెలుగు ప్రజలంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు పట్టుచీరలు ధరించి, బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకు న్నారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో 200 మంది పాల్గొన్నారు. జపాన్ తెలుగు సమాఖ్య స్వచ్ఛంద సేవా సిద్ధాంతాలతో వర్ధిల్లుతు న్నది. బతుకమ్మ లాంటి ఉత్సవాల నిర్వహణను కొనసాగించడంలో నిర్వాహకుల నడుమ సహకార స్ఫూర్తిని పెంపొందిస్తున్నది. జపాన్ తెలుగు సమాజం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ విలక్షణమైన వేడుక.. దాని గత, ప్రస్తుత నిర్వాహకులకు గౌరవకరమైనదే కాదు, వారి అచంచలమైన అభిమానానికి ప్రతీక. నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్ లేకుండానే తాము ఈ విజయవంతమైన ఈవెంట్‌లను నిర్వహించగలుగు తున్నామని జపాన్ తెలుగు సమాఖ్య వాలంటీర్ మురళీధర్ అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/11/Japan-vanabojanalu-1024x576.jpg)
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగానే జపాన్ తెలుగు సమాఖ్య వన భోజనాల కార్యక్రమం నిర్వహించింది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. టోక్యో నగరంలోని కొమత్సుగావా పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో రుచికరమైన భోజనాలు ఆస్వాదించారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.