రాఖీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధికారత సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీంతో పాటు మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, విద్య, ఉద్యోగాలపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. జీవితాంతం సోదరులు అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.