Namaste NRI

రామ్ చరణ్ జోడిగా సాయి పల్లవి

బుచ్చిబాబు దర్శకత్వంలో  రామ్‌  చరణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది వరకు శ్రీలీల పేరు బయటకు వచ్చింది. ఆమె స్థానంలోకి సాయి పల్లవి వచ్చిందా? లేదంటే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలా? అనే సంగతి తెలియాల్సివుంది. 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్‌ చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించ నున్నారు. రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీలోని నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events