Namaste NRI

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్

అహ్మదాబాద్‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయిటీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే, సంబరాలు చేసుకు నేందుకు టపాసులు సిద్ధం చేసుకున్నా  నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్యాహ్నం 1.30 గంటలకు ఫైనల్ ఫైట్ ఆరంభంకానుంది. భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌కు సినీ లోకం కదలిరానుంది. బాలీవుడ్ నటీనటులతో సహా టాలీవుడ్ హీరోలు రాంచరణ్‌, వెంకీ, నాగార్జున, కమల్‌ హాజరు కానున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 6వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు.


జట్లు:భారత్‌ : రోహిత్‌శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దిప్‌ యాదవ్‌, షమి, సూర్యకుమార్‌ యాదవ్‌, అశ్విన్‌, ఇషాన్‌ కిషన్‌.

ఆస్ట్రేలియా:  పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిష్‌, సీన్‌ అబాట్‌, కామెరాన్‌ గ్రీన్‌, హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఆడం జంపా, మిచెల్‌ స్టార్క్‌, లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events