పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా మంగళవారం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం. అజయ్ భూపతికి చెందిన ఎ క్రియేటివ్ వర్క్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విశ్వక్ సేన్ పాల్గొని మాట్లాడుతూ పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయతీగా చెప్పే దర్శకుడు అజయ్ భూపతి.ఈ సినిమాలో పాయల్ బాగా చేశారు అని అన్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ సినిమాలో పాయల్ క్యారెక్టర్‌ను డీల్ చేసిన విధానం, పాయల్ నటన, నేపథ్య సంగీతం బావుందని అంటున్నారు. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా మంగళవారం అని చెబుతున్నారు. ఇది నిజంగా హ్యాపీగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయల్, ప్రియదర్శి, బీవీఎస్ రవి, సిరాశ్రీ, తరుణ్ భాస్కర్, సురేష్ వర్మ, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, కార్తీక్, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.