సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాలింగ్ సహస్ర. డాలీషా కథానాయిక. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివబాలాజీ, మనోహరన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి.అనుక్షణం ఉత్కంఠను పంచుతూ సాగుతుంది. కొత్తదనానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అదే రీతిలో ఈ సినిమాను ఆదరిస్తారనుకుంటున్నా అన్నారు.
దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి కథ ఇదని తెలిపారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామని నిర్మాత విజేష్ తయాల్ పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సన్ని డి, సంగీతం: మోహిత్ రెహమానియక్, రచన-దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, డాలీషా, మోహిత్, మార్క్ కే రాబిన్, శశికిరణ్, నిరంజన్ పాల్గొన్నారు.