Namaste NRI

త్రిషకు మద్దతుగా నిలిచిన మెగాస్టార్‌ చిరంజీవి

స్టార్ హీరోయిన్ త్రిష పై త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ కాంట్రవర్సీపై తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. మన్సూర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఒక ఆర్టిస్ట్‌కు మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా సపోర్ట్‌గా నిలబడతాను అంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో తమిళ, టాలీవుడ్‌ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, నటి మాళవికా మోహనన్‌, గాయని చిన్మయి, టాలీవుడ్‌ హీరో నితిన్‌ సహా పలువురు స్టార్స్‌ త్రిషకు మద్దతు పలికారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events