ముంబైపై ఉగ్రదాడులు జరిగి 15 ఏళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా సంస్థపై ఇజ్రాయిల్ నిషేధం ప్రకటించింది. ముంబైపై జరిగిన దాడులు ప్రాణాంతకమైనవని, ఆ ఉగ్ర సంస్థను క్షమించేది లేదని ఇజ్రాయిల్ తెలిపింది. అయితే భారత సర్కారు సూచన లేకుండానే ఇజ్రాయిల్ తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. లష్కరే సంస్థ గురించి సమగ్ర సమాచారం సేకరించిన ఇజ్రాయిల్, ఆ సంస్థను ఉగ్రవాద నిషేధ జాబితాలో చేర్చింది. భారత్‌లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీ ఇవాళ దీనిపై ఓ ప్రకటన రిలీజ్ చేసింది. వందల మంది భారతీయ పౌరుల హత్యకు ఆ ఉగ్ర సంస్థ కారణమని ఇజ్రాయిల్ పేర్కొన్నది. 2008, నవంబర్ 26వ తేదీన జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ముంబై దాడుల్లో ఉగ్రవాదులకు బలైన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. శాంతియుత భవిష్యత్తు కోసం ఇండియాకు బాసటగా ఉంటామని ఇజ్రాయిల్ చెప్పింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)