తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తమ బృందం తెలంగాణలో చేస్తున్న ప్రచారం, ఆస్ట్రేలియా నుండి సోషల్ మీడియా-ఫోన్ కాల్స్ ద్వారా చేస్తున్న ప్రచార సరళిని కవిత వివరించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం ఎన్నారైలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఎంతో అభివృద్ది కి నోచుకుంటున్న తెలంగాణ మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే కేసీఆర్ మూడోసారి సీఎం కావాల్సిందే అన్నారు. ఊరూరా, వాడవాడలా, గడపగడపకూ తిరుగుతూ ఎన్నారైలు ప్రచారం చేయాలని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/11/NRIKAVITHA-.jpg)