Namaste NRI

ప్రియ‌మ‌ణి భామాక‌లాపం 2 ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన  చిత్రం భామాకలాపం. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాకు భామా క‌లాపం 2 అంటూ సీక్వెల్ రాబోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. శీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.  దీనికి సంబంధించి చిత్రంబృందం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రియ‌మ‌ణి అమ్మవారి రూపంలో చేతిలో వ్యాక్యూమ్ క్లీనర్‌నే ఆయుధంగా పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక పార్ట్ 1 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అభిమన్యు ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే పార్ట్ 2 ఈసారి ఓటీటీలోకి కాకుండా నేరుగా థియేటర్‌ల‌లో విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాను ఆహా స్టూడియో, డ్రిమ్ ఫార్మ‌ర్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ ఈదర, భోగవల్లి బాపినీడు క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events