నెదర్లాండ్స్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యింది. యాంటీ ఇస్లాం నేత గీర్త్ విల్డర్స్‌తాజాగా ముగిసిన జాతీయ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. 25 ఏళ్ల క్రితం విల్డర్స్ స్థాపించిన ఫ్రీడమ్ పార్టీ(పీవీవీ) జనరల్ ఎన్నికల్లో విజయం దిశగా వెళ్తోంది. ఆ పార్టీ 37 సీట్లను గెలుచుకోనున్నది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో గిల్డర్స్ పార్టీ కీలకం కానున్నది. విల్డర్స్ గెలుపు డచ రాచకీయాలను కుదిపేసింది. యూరోప్ దేశాల్లోనూ ఆ పార్టీ గురించి తీవ్ర చర్చ జరగనున్నది. డచ్ పార్లమెంట్‌లో 150 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 76 సీట్లు టార్గెట్. అయితే ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు కూటమి పార్టీలను ఒప్పించనున్నట్లు విల్డర్స్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సమయంలో అక్రమ వలసలపై ఆయన స్పష్టమైన వైఖరి వినిపించారు. బోర్డర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఇస్లాం మత గ్రంధం ఖురాన్‌ను బ్యాన్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)