టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.కాగా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలు కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వచ్చారు. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించారు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నాడు. పూరీ, మణిశర్మ, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇసార్ట్ శంకర్‌ను మించిన ఆల్బమ్ రెడీ అవుతుందని చెప్పకనే చెప్పేసింది పూరీ టీం. డబుల్ ఇస్మార్ట్ 2024 మార్చి 8న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సందడి చేయనుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)