ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిన్న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి విడుదల చేసింది. వీరిలో 13మంది ఇజ్రాయెల్, 12మంది థాయ్ పౌరులు ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిని విడిచిపెట్టినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 39 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. వీరిలో 24 మంది మహిళలు, 15 మంది టీనేజర్లు ఉన్నారు.