అమెరికాలో ఫౌండేషన్ను స్థాపించి రెండు దశాబ్దాలుగా హిందూ ధర్మంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు భారత సంతతి వైద్యుడు మేఘానీ దంపతులు. సిలిక్యాన్ వ్యాలీలో జరిగిన ఫౌండేషన్ వార్షిక సమావేశంలో మేఘానీ మాట్లాడుతూ రానున్న ఎనిమిదేళ్లలో హైందవ ధర్మం కోసం అదనంగా 15 లక్షల డాలర్లను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు హైందర ధర్మ కార్యక్రమాలకూ 10 లక్షల డాలర్ల విరాళమిచ్చామని తెలిపారు. వచ్చే పదేళ్లలో మరో 15 లక్షల డాలర్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీంతో తమ విరాళాల మొత్తం 40 లక్షల డాలర్ల ( రూ.33 కోట్లు)కు చేరుతాయని వివరించారు. తాను జీతం మీద పని చేసే వైద్యుడినని, తమ కష్టార్జితాన్ని హిందూ మతం కోసం వెచ్చిస్తున్నామని వెల్లడిరచారు. ఎమర్జన్సీ వైద్యుడైన మేఘానీ 2003లో తన మిత్రులతో కలిసి హిందూ అమెరికా ఫౌండేషన్ను స్థాపించారు.