రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈగల్. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయికలు. నవదీప్, మధుబాల ఇతర పాత్రధారులు. రానున్న సంక్రాంతికి ఈగల్ సినిమాతో సందడి చేయనున్నాడు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈగల్ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా 50 రోజులు సమయం ఉన్న సందర్భంగా ఈగల్ 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇందులో రవితేజ పాత్రలో విభిన్నమైన కోణాలుంటాయని, మాస్ మహారాజా అభిమానులు పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెలిపారు.ఈ చిత్రానికి మాటలు: కరణం మణిబాబు, సంగీతం: డేవ్ జాంద్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరి.