అమెరికాలో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును హతమార్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అమెరికాలో పన్నుని చంపేందుకు విఫల ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఇందులో భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే భారత్ స్పందించింది.
తాజాగా ఈ వ్యవహారంపై విచారణ కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. భారత్-అమెరికా భద్రతా సహకారంపై చర్చ సందర్భంగా వ్యవస్థీకృత నేరస్థులు, గన్ రన్నర్స్, ఉగ్రవాదులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్ తనవంతుగా అమెరికా పక్షం నుంచి సమాచారాన్ని సేకరించింది, దాన్ని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వ్యవహారంలో ఇప్పటికే భారత్, కెనడా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.