డెన్మార్క్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ జరుపుకున్నారు. డెన్మార్క్ ఎన్నారై సెల్ నాయకుడు ఆకుల శ్యామ్ బాబు మాట్లాడుతూ నవంబర్ 29 దీక్ష దివాస్ రోజు. ఈ రోజు తెలంగాణ చరిత్రలో మరువురాని రోజు. ఈ దీక్ష ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది. కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ సర్కార్, కేసీఆర్ దీక్షకు బయపడి తెలంగాణ ప్రకటన చేసింది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసింది ఏమిలేదు. కాంగ్రెస్ స్వతహాగా తెలంగాణ ఇవ్వలేదు. కేసీఆర్ వల్లనే వచ్చింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు చాలా రుణపడి ఉన్నామన్ని అన్నారు. మూడోసారి సీఎంగా కేసీఆర్‌ను చేద్దాం. అదే మనం కేసీఆర్‌కు ఇచ్చే పెద్ద కానుక అని అన్నారు.