ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా జాన్వీకపూర్ తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. దక్షిణాదిలో తొలి చిత్రమైన దేవర తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని జాన్వీకపూర్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ప్రత్యేకం. మా అమ్మకు ఇక్కడ లక్షల మంది అభిమానులున్నారు. అందుకే తెలుగు నేలతో నాకు అనుబంధం ఎక్కువ. హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తుంటే నా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతున్నది. హిందీతో పాటు దక్షిణాదిలో మంచి విజయాలతో మా అమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తాననే నమ్మకం ఉంది అని చెప్పింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.