తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్, 39 సీట్ల వద్ద ఆగిపోయింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా, ఎంఐఎం మళ్లీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకున్నది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందిన బిఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైంది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళిసై ఆయన్ను కోరారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలో దిగిన సిపిఐ కొత్తగూడెం స్థానం నుండి గెలుపొందింది.