తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని సూచించారు. రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజాతీర్పునకు అనుగుణంగా హుందా వ్యవహరించి తప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో త్వరలోనే సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకుందామని చెప్పారు.