ఉత్తర కొరియా లో జనన రేటు పడిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. శిశు జనన రేటు తరుగుదలను అడ్డుకోవాలన్నారు. ఇది ప్రతి ఇంటి సమస్య అని కిమ్ అన్నారు. ప్యోంగ్యాంగ్ లో మహిళలతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బర్త్ రేటు పడిపోవడాన్ని నిలువరించాలని, అలాగే పిల్లలను సరైన రీతిలో పెంచాలని, ఇవన్నీ తల్లుల బాధ్యతలను అని కిమ్ అన్నారు. యూఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం 2023లో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8గా ఉంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)