Namaste NRI

మానవసంబంధాలు, భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా: మృణాళ్‌ ఠాకూర్‌

నాని జోడీగా మృణాళ్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడు.మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మృణాళ్‌ ఠాకూర్‌ విలేకరులతో మాట్లాడుతూ  సీతారామంలో సీత హాయ్‌ నాన్నలో యష్ణ. రెండూ వైవిద్యమైన పాత్రలే. సీతారామం 60, 70ల్లో జరిగే కథ. హాయ్‌ నాన్న నేటి తరానికి చెందిన కథ. ఇందులో నా పాత్ర కూడా ఇప్పటి అమ్మాయిలకు ప్రతిరూపంలా ఉంటుంది.  ఈ పాత్రలో చాలా లేయర్లుంటాయి. మానవసంబంధాలు, భావోద్వేగాల సమ్మేళనం ఈ సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే డివైన్‌. షూటింగ్‌ చేస్తున్నప్పుడు అదే భావనతో పనిచేశాం అని చెప్పింది. నానీతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని, ఆయనతో నటిస్తుంటే పర్‌ఫార్మెన్స్‌ మరింత ఎలివేట్‌ అవుతుందని  అన్నారు.

అందరం నిజాయితీగా పనిచేశాం. చేస్తున్నప్పుడే గొప్ప సినిమా అని అర్థమైపోయింది. దర్శకుడు శౌర్యువ్‌తో పనిచేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. తను క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ని ఈ నెల 7న చూస్తారు అని చెప్పింది. నిర్మాతలు రాజీ అనే పదానికి తావివ్వకుండా పాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని, సాంకేతికంగా అద్భుతం గా ఈ సినిమా ఉంటుందని ఆమె అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events