Namaste NRI

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి… 7న ప్రమాణ స్వీకారం

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. సీఎం పదవికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేరును ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ఢల్లీిలో ప్రకటించారు. డిసెంబర్‌ 7న ముఖ్యమంత్రిగా రెేవంత్‌ రెడ్డి  ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలో రేవంత్‌ పేరును ప్రకటించారు.

రేవంత్ రెడ్డి ప్రొఫైల్…

నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు.

2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడుగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు.

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్య్రంగా ఎన్నికయ్యారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014లో రెండోసారి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

2014 – 17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపిక అయ్యారు.

2017 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా చేశారు.

2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంపిక అయ్యారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు.

2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ ఎంపికయ్యారు.

2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఎల్‌.బి.స్టేడియంలో 7వ తేదీ ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యావత్‌ తెలంగాణ సమాజాన్ని ప్రమాణ స్వీకారానికి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో ఇక ప్రజాపాలన మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events